మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 08: ఉత్తమ సామాజిక సేవ అందిస్తున్న సర్పంచ్ గా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ సాదు జ్యోత్స్నాబాయ్ అవార్డు అందుకున్నారు. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు సామాజిక సేవలు అందించే వారిని గుర్తించి 2023 జాతీయ అవార్డులు ఆదివారం హైదరాబాదులో అందించారు. ఈ అవార్డులో ఉత్తమ సామాజిక సేవ అందిస్తున్న సర్పంచ్ గా సర్పంచ్ జోత్స్నా కి అవార్డు దక్కింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, సమాజ సేవ చేయడానికి ఇలాంటి అవార్డు దక్కటం మరింత పోత్సాహాకారమని అవార్డు అందించిన నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజలకు సేవ చేయడంలో మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.





