మన్యం న్యూస్:మహిళల బతుకు మార్చే తెలంగాణ రాష్ట్రం కావాలని బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జి బాదావత్ ప్రతాప్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆడపడుచులకు కావాల్సింది బతుకమ్మ చీరలు కాదని ప్రజల బ్రతుకులు మారిచే జీవనోపాధి, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ఏర్పాటుచేసి వారిని ఉద్యోగుల గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.గర్భిణీ స్త్రీలకు పౌస్టికమైన ఆహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు తచ్చొడి సత్యనారాయణదొర, జిల్లా నాయకులు పప్పుల గోపీనాథ్, మండల నాయకులు లోకేష్, కిరణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.





