మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 08, ఆశ వర్కర్లు వారి సమస్యల సాధనకై సమ్మె చేప్పట్టడం జరిగింది. ఆదివారం మండల కేంద్రంలో సమ్మె శిబిరంలో పాల్గొన్న ఆశ వర్కర్లు అందరికీ జూలూరుపాడు గ్రామానికి చెందిన సాయిన్ని అనిల్ మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ
దసరా పండుగ సమీపిస్తున్న సమయంలో ఆడపడుచులు రోడ్డు వెంబడి వారి సమస్యల సాధన కోసం పాట్లు పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.





