UPDATES  

 పోడు సాగుదారుల పట్టాలు ఇవ్వాలి *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

 

మన్యం న్యూస్ ,చర్ల:పోడు సాగుదారులకు న్యాయ బద్దంగా పట్టాలు ఇవ్వాలి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది.
1980 సంత్సరంలో పోడుకొట్టుకొని సాగు చేసుకుంటున్న వారిని పారెస్ట్ అధికారులు బెదిరించి కేసులు నమోదు చేసి ఆ భూములను కొంతమంది స్వార్థపరుల పేరుతో పట్టాలు చేపించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లింగాలకాలనీ గ్రామంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ కలివేరు గ్రామపంచాయతీ లింగాలకాలనీ గ్రామ ప్రజలు ఆదివాసీలు. ఈ ప్రజలు రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు. అలాంటి ప్రజలు 1980లో పోడుభూమి కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు బెదిరించి లాక్కొని నిర్బంధాలకు గురిచేసి కొంతమంది స్వార్థపరులకు పట్టాలు ఇచ్చారు. దీనిలో కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఇప్పటికైనా మండల అధికారులకు ఫారెస్ట్ అధికారులకు పట్టాలని రద్దుచేసి గ్రామసభ నిర్వహించి న్యాయబద్ధంగా అందరికీ భూమిని పంచాలని సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరినాము. అందుకే ఈరోజు న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి చట్టాలను తారుమారు చేయడం కాదు న్యాయబద్ధంగా ఆలోచించాలని నల్ల గుడ్డలతో కళ్ళగంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్, ప్రగతిశిల పి ఓ డబ్ల్యు మహిళా సంఘం నాయకురాలు బొర్ర సమ్మక్క, కనకమ్మ, సబ్కా నాగలక్ష్మి, అలవాల భద్రమ్మ, ఇరుప రుక్మిణి, బుర్ర ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !