మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల సహకారం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని సుమారు 450 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను ఆదివారం ఎమ్మెల్యే వనమా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడమే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్ళని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. కొందరు డబ్బులు సంచులతో ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నారని వారి నుండి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీపీ బుక్య సోనా, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, తాసిల్దార్ ప్రసాద్, ఎండిఓ రమేష్, ఎంపీ ఓ శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూఖ్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు కొల్లు పద్మ, స్వాతి, బాబురావు, మూర్తి, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు నెంబర్లు, ఉప సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.





