UPDATES  

 ఆదిపర్వం ఫస్ట్ లుక్ రిలీజ్.. భయపెడుతున్న మంచు లక్ష్మీ..

అమ్మోరు, అరుంధతి జోనర్ లో వస్తున్న మరో చిత్రం ఆదిపర్వం. మంచు లక్ష్మీ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ( Adhi Parvam First look) ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఆదివారం (అక్టోబరు 10)న మంచు లక్ష్మీ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో ఆమె చాలా భయంకరంగా ఉంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అన్వికా ఆర్ట్స్ – అమెరికా ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో 1974 – 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. ఎర్రగుడి అమ్మవారి నేపథ్యంలో దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం చుట్టూ సాగే కథగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రలో మంచు లక్ష్మీ కనిపించబోతున్నారని దర్శకుడు సంజీవ్ అన్నారు. అంతేకాకుండా ఈ పాత్ర ఆమె కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఇందులో ఆమె చేసిన రెండు యాక్షన్స్ సీన్స్ మూవీకే హైలెట్ అని మేకర్స్ అన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అంతర్లీనంగా అందమైన ప్రేమకథ కూడా దాగి ఉంటుందని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో మంచు లక్ష్మితో పాటు ఆదిత్యం ఓం, ఎస్తేర్‌, సుహాసిని మణిరత్నం, శ్రీజిత, ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా మంచు లక్ష్మీ యాంకర్ గా, నటిగా, ప్రొడ్యూసర్ గా మంచు గుర్తింపు దక్కించుకుంది. ఆమె చివరిగా పిట్టకథలు’, ‘మాన్ స్టర్’ వంటి చిత్రాల్లో నటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !