మన్యం న్యూస్ ,ఇల్లందు రూరల్:- స్నేహితులు అంటే చిట్ చాట్ కబుర్లు, గెట్ టు గేదర్ వంటి కార్యక్రమాలు నిర్వహించి సంతోషాన్ని పంచుకోవటం మాత్రమే కాదు స్నేహితుని మరణాంతరం ఆయన కుటుంబాన్ని తమ బాధ్యత గా స్వీకరించి దోస్త్ కుటుంబానికి చేయూత నందించారు కొంత మంది స్నేహితులు. ఇల్లందు మండలం 21 ఫీట్ ఏరియా కు చెందిన బోల్లెద్దు నాగరాజు ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు బార్య ఒక కుమారుడు ఉన్నారు. మరణంతో సమస్యల వలయంలో సతమతం అవుతున్న కుటుంబాన్ని గుర్తించిన నాగరాజు తో చదువుకున్న 1995-96 సింగరేణి స్కూల్ బ్యాచ్ బాల్య స్నేహితులు కొంత మంది, రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి బాల్య మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు.





