మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి తోడు నీడగా ఉంటానని శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 2 కోట్ల వ్యయంతో మంజూరు అయినా టౌన్ హాల్ కు శంకుస్థాపన, ఐ టి సి సౌజన్యంతో 1 కోటి వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీని వనమా ప్రారంభించారు. అనంతరం పాల్వంచ మండలం పరిధిలోని 968మంది లబ్ధిదారులకు, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 211 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కొత్తగూడెం ప్రజలు తనకు దేవుళ్ళని తుది శ్వాస వరకు పనిచేస్తానన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తన అభివృద్దె కనపడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కెసీఆర్ ను, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఐ టి సి అధికారి చంగల్ రావు, మున్సిపల్ కమిషనర్ ఏ. స్వామి, ఆర్ అండ్ బి అధికారి నాగేశ్వరరావు, ఎంపీడీవో అప్పారావు, జడ్పిటిసి బరిపాటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.





