మన్యం న్యూస్,దుమ్ముగూడెం:
మండల కేంద్రం ములకపాడు సబ్ స్టేషనులో నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న తాటి కోటేశ్వరరావు (28) విద్యుత్ ఘాతంతో దుర్మరణం చెందాడు. సోమవారం మధ్యాహ్నం గంగోలులో విద్యుత్తు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న సమయంలో విద్యుత్ ఘాతానికి దుర్మరణం చెందారు. చర్ల మండలం రాళ్లగూడెంకి కోటేశ్వరరావుకి భార్య పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబీకులు సబ్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు.ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.





