UPDATES  

 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది
* అభ్యర్థులు నిబంధనలు పాటించాలి
* కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ నిబంధనలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల, ఎస్పి డాక్టర్ వినీత్ ఐడిఓసి కార్యాలయంలో
ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని జిల్లా కలెక్టర్
చెప్పారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు
చివరి తేదీ నవంబర్ 10, 13వ తేదీన స్క్రూట్నీ నిర్వహించనున్నట్లు చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు
చివరి తేదీ నవంబర్ 15 వరకు ఉన్నదని, నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా పకడ్బందిగా అమలు
చేసేందుకు 24 గంటలు పనిచేయు విధంగా 1950 నెంబర్ తో కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తామని చెప్పారు. కంట్రోల్ రూముకు,
సి విజిల్ యాప్ కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టనున్నట్లు
చెప్పారు. ఎన్నికలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించుటలో ప్రజలు సమస్యలను కంట్రోల్ రూముకు కానీ, సి విజిల్ యాప్కు కానీ తెలియచేయాలని చెప్పారు. క్వాలిటీ రెస్పాన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వ
కార్యాలయంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు 24 గంటల్లోగా, ప్రభుత్వ స్థలాలలో ఉన్న రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను, గోడలపై రాతలను 48 గంటల లోగా తొలగించేందుకు ఇప్పటికే
ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రవర్త నియమావళిని ప్రభావంతంగా అమలు చేసేందుకు ప్లయింగ్
స్క్వాడ్స్, ఎస్ఎస్ఎ, ఎంసీఎంసీ, యంసిసి టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సంఘ
నియామవళిననుసరించి ఎన్నికల్టో పోటీ చేయు అభ్యర్థుల ప్రచార పోస్టర్లు, కరపత్రాలు ముద్రించే ప్రింటింగ్
సంస్థలు కచ్చితంగా వాటిపై ప్రింటర్ పేరు పబ్లిషర్ పేరు, మొబైల్ నెంబర్ ను విధిగా ప్రచురించాలన్నారు. అలా చేయని పక్షంలో బాధ్యులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్స్ స్వీకరణకు 10 రోజుల ముందు వరకు
అక్టోబర్ 1, 2023 నాటికి 18
సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశం అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో
పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు మీడియా ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 5 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 1095 పోలింగ్ కేంద్రాలు
ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 9,45,094 మంది ఓటర్లున్నారని వారిలో పురుషులు 4,61,315
మంది, మహిళలు 4,83,741మంది, 38 మంది ట్రాన్సండర్లు, యన్ఆర్ఎస్ఐలు 43 మంది, సర్వీసు ఓటర్లు 73 మంది దివ్యాంగ ఓటర్లు 14930 మంది, 18-19 వయస్సున్న ఓటర్లు 22096 మంది, 80 సంవత్సరాలు
పైబడిన ఓటర్లు 13082 మంది ఉన్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు,
ర్యాంపులు, వీల్చైర్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గ
పరిధిలోని 8 కొండరెడ్ల ఆవాసాల్లో 692 మందికి ఓటుహక్కు కల్పనపై కేంద్ర ఎన్నికల సంఘం అభినందించినట్లు చెప్పారు. 170 మంది సెక్టోరియలో
అధికారులను నియమించినట్లు చెప్పారు. పోటీ చేయు అభ్యర్థులకు సువిధ యాప్ ద్వారా అన్ని రకాల
అనుమతులు జారీ చేయనున్నట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ జిల్లాలో 223 పోలింగ్ కేంద్రాలను తీవ్రవాద ప్రభావిత
ప్రాంతాల్లో ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు
చెప్పారు. 24 గంటలు పనిచేయు విధంగా అంతరాష్ట్ర, జిల్లా సరిహద్దులో పటిష్ట బద్రత ఏర్పాట్లు చేసినట్లు
చెప్పారు. నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలను వెంటతెచ్చుకోవాలని చెప్పారు. సీజ్ చేసిన
నగదుకు తగిన ఆధారాలు చూపిన పక్షంలో 24 గంటల్లో విడుదల చేస్తామని, ఆధారాలు చూపకపోతే అక్రమంగా
బావించి సీజ్ చేసి తదుపరి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత,
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తమవంతు సహకారం అందిస్తున్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై
ఎన్నికల సంఘ నియమ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6
గంటల వరకు ప్రచార కార్యక్రమాలు నిలిపివేయాలని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం అమల్లో ఉంటుందని
చెప్పారు. సోషల్ మీడియా, ఇతర మీడియాలలో కుల, మతాల పరంగా తప్పుడు పోస్టులు చేసే వ్యక్తులపై
చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో వచ్చే వార్తలపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అనుమతి పొందిన తుపాకులను ఆయా పోలీస్ స్టేషన్లులో అప్పగించాలని
ఆయన సూచించారు. ప్రజలు ఏదేని సహాయతకు సంబంధిత పోలీస్ స్టేషన్లును సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిపిఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !