- బీసీలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
- లక్షణంగా లక్ష సాయం
- కులవృత్తులకు పూర్వ వైభవం
- 200 మందికి చెక్కుల పంపిణీ
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని గిరిజన భవన్ నందు బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం పథకంలో భాగంగా పినపాక నియోజకవర్గం కు చెందిన 200 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున 2 కోట్ల రూపాయల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,బీసీ బంధు పథకం దేశానికే ఆదర్శమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని అన్నారు. కులవృత్తులను నమ్ముకున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని, నియోజకవర్గం లోని 200 మంది బీసీ కుటుంబాలకు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది అన్నారు.అన్నివర్గాల వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని విప్ రేగా తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అని అన్నారు.అందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బీసీలకు లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందజేయాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. బీసీలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీ బంధును తీసుకువచ్చినట్లు తెలిపారు.బీసీలు ఉపాధి పొందుతూ,పదిమందికి పని కల్పించాలని వారు ఆకాంక్షించారు.సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విప్ రేగా కొనియాడారు.దళిత బంధు,గృహలక్ష్మి పథకాలకు దరఖాస్తులు నిరంతరం ప్రక్రియ అని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు,మణుగూరు తహశీల్ధార్ రాఘవరెడ్డి,ఎండిఓ చంద్రమౌళి,మున్సిపల్ కమిషనర్,ఉమామహేశ్వరరావు,ఏడూ మండలాల జడ్పీటీసీ లు,ఎంపీపీ లు,ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు,పార్టీ కార్యదర్శులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.





