మన్యం న్యూస్,ఇల్లందు:ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో ఆర్జీ-3 సెక్యూరిటి గార్డుపై బీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా సోమవారం ఇల్లందులోని సింగరేణి సెక్యూరిటి ఆఫీస్ ముందు గార్డులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఫిట్ సహయకార్యదర్శి దాట్లవేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటి గార్డు నాగయ్యపై బిఆర్ఎస్ లడనాపూర్ సర్పంచ్ భర్త బడికెల శ్రీనివాస్ అతని అనుచరులతో కలిసి దాడిచేసి గాయపరిచారని ఇది హేయమైన చర్య అని దీనిని యూనియన్లకు అతీతంగా ప్రతిఒక్కరూ ఖండించాలని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ నాయకులు అధికార ఉందని పెట్రేగిపోతు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెక్యూరిటి గార్డుపై దాడిని ఏఐటియుసి తీవ్రంగా ఖండింస్తుందని, తక్షణమే దాడికి పాల్పడిన బడికెల శ్రీనివాస్ అతని అనుచరులను శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐటియుసి ఆద్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా సెక్యూరిటి గార్డులను చైతన్యపరిచి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తమ్మిడి కామరాజు, శ్రీనివాస్, రవి, బిందాలాల్, అన్వర్, పవన్ కుమార్, ఆర్ శ్రీనివాస్, భాస్కర్, రాంచందర్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.





