మన్యం న్యూస్, అశ్వాపురం: మండలం కేంద్రంలో సుమారు రూ 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న యాదవ్ ,విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల అభ్యున్నతే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షన్,వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం,ఎంపీటీసీలు,గ్రామపంచ యితీలో సర్పంచులు,ఉప సర్పంచ్లు ,వార్డు మెంబర్లు,ఎమ్మార్వో రమాదేవి,ఎంపీడీవో వరప్రసాద్,ఎంపీ ఓ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ ,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,యాదవ్ సంఘం మండల అధ్యక్షులు జనార్ధన్,మండల ప్రజా పరిషత్ సిబ్బంది,తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ,మండల యాదవ్ లు,విశ్వబ్రాహ్మణులు మండల నాయకులు ,యువజన నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ,వివిధ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





