మన్యం న్యూస్,చండ్రుగొండ,అక్టోబర్ 9: మండల కేంద్రమైన చండ్రుగొండలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యలయాన్ని ఆర్జేడి డి. ఝాన్సీలక్ష్మిభాయి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో గల రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని, పౌష్టికాహర పంపిణీలో పారదర్శికత పాటించాలని సిడిపిఓ నిర్మలాజ్యోతికి సూచించారు. అంగన్వాడీలు సమయపాలన పాటించేలా చూడాలన్నారు. గర్భీణీలు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహరం కుటుంబ సభ్యులు వాడకుండా చూడాలన్నారు. గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలు, పౌష్టికాహర కేంద్రాలు ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, కార్యలయ సిబ్బంది పాల్గొన్నారు.





