మన్యం న్యూస్ గుండాల: గుండాల మండలంలోని ఇరువురికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, బీఆర్ఎస్ నాయకులు వట్టం రవి సోమవారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. శేట్టుపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి కి రూ60వేలు, మామ కన్ను గ్రామానికి చెందిన రేగా చిరంజీవికి రూ30వేలు సీఎం సహాయనిధి నుండి మంజూరు కావడంతో సోమవారం వారి ఇరువురికి నేతలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనారోగ్యం పాలై ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించి వారికి అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొరస లాలయ్య, మహేందర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు





