మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 09, మండల కేంద్రంలో బజాజ్ షోరూం లో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఎన్ 150 సిసి పల్చర్ బైక్ ను బజాజ్ షోర్రూమ్ అధినేత రామారావుతో కలిసి స్థానిక ఎస్సై బి పురుషోత్తం రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మార్కెట్ లోకి కొత్తగా ఆకర్షించే బైక్ లు వస్తు ఉంటాయని అన్నారు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఎన్ 150 సిసి బైక్ ని లాంచ్ చెయ్యటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బజాజ్ షోర్రూమ్ సిబ్బందిని ఎస్సై అభినందించారు. కొత్త బైక్ లు కొనుగోలు చేసిన తర్వాత అతివేగంగా వేళ్ళవద్దని, ప్రతిఒక్కరు హెల్మెట్ లు ధరించి సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దాయనంద్, కానిస్టేబుల్స్ సూర్యం, వెంకటేశ్వర్లు తో పాటు షోర్రూమ్ సిబ్బంది ప్రభాకర్, శ్రీకాంత్, నాగరాజు, అలిమ్, వేణు తదితరులు పాల్గొన్నారు.





