UPDATES  

 ఎంఎల్ పార్టీ నుండి 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఎంఎల్ పార్టీ నుండి 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఇల్లందు నియోజకవర్గంలో మరలా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం

ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు

మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో సోమవారం మర్రిగూడెం గ్రామంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మూతి సారమ్మ అధ్వర్యంలో ఎంఎల్ పార్టీకి చెందిన ముప్పై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ శంకర్ నాయక్ లు పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి అహ్వనించారు. ఈ సందర్భంగా చీమల మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అదేవిధంగా మరలా ఇల్లందులో జెండా ఎగురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఏ, బీ బ్లాక్ అధ్యక్షులు జలీల్, తాడెం సామ్రాట్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరిక్రిష్ణ, మండల పార్టీ ఉఫాధ్యక్షులు వల్లాల రాజన్న, మోకాళ్ళ పాపారావు, చీమల వెంకటేశ్వర్లు, సుర్నపాక రామారావు, మూతి హనుమంతు, గొగ్గెల పాపారావు, కాయం రమేష్, హరి, సాయి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !