మన్యం న్యూస్,ఇల్లందు: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దాదాసాహెబ్ కాన్సిరాం 17వ వర్ధంతి వేడుకలను పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడ్డ జాతులకు అధికార రుచి చూపించాలని, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని బహుజన ప్రజలకు నేర్పిన గొప్పమేధావి, బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లేతాకుల కాంతారావు, చిప్పలపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రాయల శ్రీనివాసరావు, మండల నాయకులు వినోద్, శ్రీను, మహేష్, హరిలాల్, సురేష్, లక్ష్మయ్య, సీతారాములు, కిరణ్, లోకేష్ , రాకేష్, సాయి, శ్రీకాంత్, శేఖర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.





