మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం నాయకులగూడెం గ్రామంలో న్యూడెమోక్రసీ నాయకురాలు గొగ్గేలచంద్రక్క స్మారక స్తూప నిర్మాణానికి సర్పంచ్ సూర్ణపాక రామయ్య శంకుస్థాపన చేశారు. పార్టీ జెండాను ఎల్లబోయిన రవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యాకన్న, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రక్క సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందన్నారు.అటువంటి చంద్రక్క స్మారక స్థూప నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. గొగ్గల రామన్న అధ్యక్షతన జరిగిన
ఈ కార్యక్రమంలో తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, మండల నాయకులు ఎల్. చిన్నస్వామి, సొసైటీ డైరెక్టర్ ఈర్ప మల్లమ్మ, వార్డ్ మెంబర్ వర్స తిరుపతమ్మ, గ్రామ నాయకులు కల్తి సుజాత, ఇర్ఫ లక్ష్మి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తడితరులు పాల్గొన్నారు.





