మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మీకానికి చెందిన నాటు సారా అమ్మే వ్యాపారస్తులు కేతినేని నరసింహారావు, సోయం రాజారావు, కండెల దుర్గయ్య, పోశయ్య లను ఎక్స్చేంజ్ సీఐ రెహమునిషా అదుపులోకి తీసుకున్నారు.గతంలో పలుమార్లు హెచ్చరించిన తమ పద్ధతి మార్చుకోకపోగా అక్రమ నాటు సారా రవాణా మండలంలో విచ్చలవిడిగా చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఈ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తాసిల్దార్ కార్యాలయంలో బైండవరు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎక్స్చేంజ్ సిఐ మాట్లాడుతూ మండలంలో నాటు సారా కాచిన, అమ్మిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు.





