మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం సుభాష్ నగర్ కరెంట్ ఆఫీస్ నుండి డిగ్రీ కాలేజ్ వరకు పెండింగ్ లో ఉన్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులకు ఎమ్మెల్యే హరిప్రియ పచ్చ జెండా ఉపారు.30 లక్షల విలువ చేసే డిఏంఎఫ్టి నిధులుతో జరగబోయే పనులకు ప్రజాప్రతినిధుల తో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వల్లాల మంగమ్మ, ఎంపీటీసీ శీలం ఉమ, పీఅర్డిఇ రచ్చ రామకృష్ణ మండల అధ్యక్షుడు శీలం రమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక కోఆప్షన్ సభ్యులు ఘాజి మరియు స్థానికులు పాల్గొన్నారు.





