మన్యం న్యూస్,చండ్రుగొండ,అక్టోబర్ 10: ఎన్నికల కమీషన్ ఆదేశాలను గ్రామాల్లో పకడ్బందీగా అధికారులు అమలు చేస్తున్నారు. మంగళవారం గ్రామాల్లో ఉన్న రాజకీయపార్టీలు దిమ్మెలు, జాతీయనాయకులు, రాజకీయనాయకుల దిమ్మెలకు పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది ముసులు తొడిగారు. పార్టీల ప్లెక్సీలు, జెండాను, పోటోలను తొలగించారు. గొడలపై వ్రాసిన రాజకీయపార్టీల నినాదాలను సైతం తొలగించాలని పార్టీలకు సూచించారు. ఎన్నికల నిబంధనలు వెంటనే అమలు చేస్తుండటంతో రాజకీయపార్టీలు నియమావళిని గమనిస్తున్నాయి.





