మన్యం న్యూస్, మంగపేట.
మార్చి 2023 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎక్కటి సరోజినీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగపేట కు చెందిన
6 ఆరుగురు విద్యార్థినిలు బండారి, (982/1000 బీపీసీ ), గుర్రాల హేమలత (959/1000 BPC),దంతెన పల్లి మానస(956/1000 ఎంపీసీ ),
కుంచం రూపకళ(954/1000 ఎంపీసీ ),గుమ్మడాల నీలిమ(945/1000 బీపీసీ,)
గుడ్డేటి అఖిల( 938/1000 బీపీసీ ) లు కేంద్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం అందించే జాతీయ ప్రతిభా ఉపకారవేతనములకు ఎంపికైనారు. వీరికి డిగ్రీ స్థాయిలో మూడేళ్లు , పీజీ స్థాయిలో రెండేళ్లు ప్రతి సంవత్సరం 10 వేల చొప్పున ఉపకారవేతనం చెల్లిస్తారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి .వెంకటయ్య, అధ్యాపకులు సంతోష్ కుమార్,రేణుకాదేవి, జ్యోతిర్మయి,లక్ష్మణ.అనిల్ కుమార్, రవీంద్రనాయక్, .శ్రీనివాస్, చిరంజీవి, .రాజు, .వైష్ణవి వందన హర్షం వ్యక్తం చేశారు.
