UPDATES  

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండించిన రాష్ట్రనేత ఆవునూరి మధు

 

మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంపై సోమవారం సాయంత్రం ఐదుగంటలకు పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఆవునూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తిసత్యం, ఏఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మండల వెంకన్న, న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లాకార్యదర్శి బండారి ఐలయ్యలు మాట్లాడుతూ..అక్టోబర్ 9న సాయంత్రం ఐదుగంటలకు పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆఫీస్ పై పోలీసులు దాడిచేసి ఆఫీసులో గదులన్నింటిని సోదాచేశారన్నారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్రకార్యదర్శి ఆవునూరి మధు ఎక్కడున్నాడని ఆఫీస్ బాయ్ ని దబాయించి అడిగారని, మధు ఉండే రూము ఎక్కడుందని ఎంక్వయిరీ చేశారని తెలిపారు. మఫ్టీలో ఉన్న పోలీసులు మధు ఫోన్ నెంబర్ను అడిగి ఆఫీసులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మధురహస్య నాయకుడు కాదని చట్టబద్ధంగా పనిచేస్తున్నాడని మధు గురించి ఆరాతీయాల్సిన అవసరం లేదన్నారు. ఆఫీస్ పై దాడి చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని కావాలని మమ్ములని రానున్న ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బతీయడానికి అధికార పార్టీ నేతలే ఈ దాడులు చేపిస్తున్నారని మధును అరెస్టు చేపించి తప్పుడు కేసులు పెట్టి రాజకీయ లబ్ధికోసం పోలీసుల ద్వారా ఆఫీస్ పై దాడి చేపించిందని వారు ఆరోపించారు.
గత ఎన్నికలలో కూడా అధికార పార్టీ ఈ విధంగానే మధును అరెస్ట్ చేసి తప్పుడుకేసులు పెట్టి జైలు నుండి బయటకు రాకుండా నిర్బంధించిందని నేడు కూడా ఇదే వైఖరిని అవలంభిస్తోందని అన్నారు.
ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాలని వారు కోరారు. ఈసమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయకార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యాకన్న, ఎస్కే ఉమర్, ఖమ్మం జిల్లానాయకులు ప్రకాష్, పోలారం సర్పంచ్ వాంకుడోత్ సరోజిని, పోసారం సర్పంచ్ వాంకుడోత్ శ్రీను, బోయితండా సర్పంచ్ సంతు, ఏఐకేఎంఎస్ జిల్లాఅధ్యక్ష, కార్యదర్శులు బట్టు ప్రసాద్, కందగట్ల సురేందర్, ఐఎఫ్టియు జిల్లాప్రధానకార్యదర్శి కొక్కుసారంగపాణి, రాష్ట్రనాయకులు ప్రసాద్, పిఓడబ్ల్యు ఖమ్మంజిల్లాకార్యదర్శి వై.జానకి, అరుణోదయ జిల్లాప్రధానకార్యదర్శి ఎనగంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !