మన్యం న్యూస్,పినపాక:వచ్చే నెల నవంబర్ 4న శనివారం నామినేషన్ వేస్తా అని పినపాక నియోజకవర్గ బీ. ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి, విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం ఆ పార్టీ కార్యకర్తల నడుమ ప్రకటించారు. మంగళవారం మండల పరిధి ఏడోళ్ల బయ్యారం లో టిఆర్ఎస్ పార్టీ మండల సమావేశానికి హాజరై మాట్లాడారు .రెండవ సెట్ తో అదే నెల 5న సుమారు 50వేల కార్యకర్తలతో నామినేషన్ వేస్తామని తెలిపారు.ఈ మేరకు బీ. ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. బీ. ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
