UPDATES  

 అభివృద్ధిని చూసే చేరికలు

 

ములుగు జెడ్పీ చైర్ పర్సన్,బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి.
మన్యం న్యూస్,ములుగు:
అభివృద్ధిని చూసి ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు బీ. ఆర్.ఎస్ లో చేరుతున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్,బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. గుడేప్పాడ్ లోని ఎన్ఎస్ఆర్ హోటల్ లో ఆమె ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎస్ ఎస్ తాడువాయి మండలానికి చెందిన కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ పాలకుర్తి రజిత రవీందర్,కాటాపూర్ గ్రామ బీజేపీ పార్టీ కి చెందిన 1వ వార్డు సభ్యులు ముత్యాల సతీష్ కు బీ. ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు, జిల్లా అభివృద్ధి ,అందులో భాగంగా ములుగు జిల్లా ఏటూరూనాగారాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తు జీవో జారీ చేయడం అలాగే ఏటూరూనాగారంలో ఫైర్ స్టేషన్ ను మంజూరు చేయడం యిటువంటి ప్రజా కర్షక పనులకు ఆకర్షితులై తాము కూడా బాగస్వాములు కావాలనే ఉద్దేశంతో వారు బీ. ఆర్.ఎస్ లో చేరినట్లు తెలిపారు.కార్యక్రమం లో టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి , గ్రంధాలయం సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ,తాడ్వాయి మాజి జడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొనడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !