మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి అక్టోబర్ 10:అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ స్పందన తనిఖీ చేశారు.అనంతరం పిహెచ్సిలో జరుగుతున్న ఓపి సేవలను,జ్వరం కేసులను,ప్రత్యేకంగా మహిళలకు అందుకున్న ఆరోగ్య మహిళ క్లినిక్ సేవలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్త పరీక్షలు చేయించుకోవాలని,ఇంటి పరిసర ప్రాంతాలలోని నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.పిహెచ్సిలో జరుగుతున్న ఆరోగ్య మహిళ క్లినిక్ ను పరిశీలించి తగు సూచనలు తెలియజేశారు.వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కాలానుగుణంగా వ్యాధులు వస్తాయని ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.అనంతరం అబ్బుగూడెం,మర్రిగూడెం గ్రామాలలో హెల్త్ క్యాంప్ లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎర్రగుంట పిహెచ్సి డాక్టర్ ప్రియాంక,డాక్టర్ తన్మయి,డిపిఎంఓ వెంకటేశ్వరరావు,హెచ్ఎస్ నాగేశ్వరరావు,పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





