బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం విజయవంతం చేయండి
ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ప్రభుత్వ ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని పద్మశాలి భవన్ నందు నేడు ఉదయం 11 గంటలకు, మణుగూరు పట్టణ ముఖ్య నాయకులతో మధ్యాహ్నం 02 గంటలకు మణుగూరు మండలంలోని ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరవుతారని వారు తెలిపారు.మణుగూరు మండలలోని ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,మహిళా నాయకులు,యువజన నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,విద్యార్థి విభాగ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, సమావేశాన్ని విజయవంతం చేయగలరని మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు కోరారు.