మన్యం న్యూస్ మణుగూరు:
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలి అని మణుగూరు ఎండిఓ చంద్రమౌళి తెలిపారు. నేటి నుంచి డిసెంబర్ 3 వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది అని,ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలతో పాటు,అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి అన్నారు. మణుగూరు మండలంలోని నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం జరుగుతుందని,అన్ని రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తక్షణమే తొలగించడం జరుగుతుందని అన్నారు. ఇందుకు కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతుందన్నారు.ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున 50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది అని,నగదుకు సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు,పార్టీల నాయకులు,ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని తెలిపారు.