మన్యం న్యూస్,ఇల్లందు:ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో సింగరేణి యాజమాన్యం ద్వంద్వనీతిని వ్యతిరేఖిస్తు మంగళవారం ఇల్లందు జీఎం కార్యాలయం మందు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏఎస్ఓ పంజాల శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ..అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మెన్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు, ఈపి ఆపరేటర్లు మెడికల్ అన్‌ఫిట్ అయితే సర్ఫేస్‌లో సేమ్ జాబ్ ఇవ్వాలని ఏఐటీయూసీ తో సహా అన్నిసంఘాలు 2021 నవంబర్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తే యాజమాన్యం 2022ఏప్రిల్ 19 తారీఖున యూనియన్లతో ఒప్పందం చేసుకుందని అన్నారు. తొంభై రోజులలో కమిటీని వేసి వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందని కానీ గత ఆరునెలల నుంచి వీటిమీద ఎటువంటి నిర్ణయం తీసుకోని యాజమాన్యం సింగరేణిలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి హడావిడిగా కొంతమంది తొత్తు యూనియన్లను దగ్గర పెట్టుకొని ఈనెల ఏడున సెర్క్యూలర్ విడుదల చేయడం జరిగిందని ఈ సర్కులర్ కూడా లోపాయ భూష్టంగా కేవలం ట్రేడ్స్‌మెన్, మైనింగ్ స్టాప్ ని మోసం చేయటానికి ఇచ్చిన సర్కులర్ అని దుయ్యబట్టారు. ఈ సర్కులర్లో ట్రేడ్స్ మెన్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదని అదేవిధంగా చర్చల సందర్భంగా ఈపి ఆపరేటర్లకు కూడా పరిశీలిస్తామన్న యాజమాన్యం నేటి ఈ సర్కులర్లో ఈపీ ఆపరేటర్ల గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదని ఇది కేవలం సింగరేణిలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కార్మికులను మోసం చేయటానికి జారీచేసిన సర్క్యులర్ అని పేర్కొన్నారు. దీన్ని మేము ఏఐటీయూసీ గా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సర్కులర్ ని సత్వరమే మార్చి మైనింగ్ స్టాప్ ట్రేడ్స్ మెన్ సోదరులకు, ఈ&ఎం సూపర్వైజర్లకు, ఈపీ ఆపరేటర్లకు అందరికీ ఎప్పటికీ ఉండేటట్టుగా సర్కులర్ ని జారీచేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కొరిమి సుందర్, సంజీవచారి, టిజెఎస్ జిల్లా ఉపాద్యక్షులు గుగులోత్ కృష్ణ, బొల్లేద్దుల శ్రీనివాస్, మంచాల వేంకటేశ్వర్లు, పైడి రాజు, దాట్లవేంకటేశ్వర్లు, సామ్యూల్, విజయ్ కుమార్, ప్రసాద్ రెడ్డి, మురహరి, ప్రభుదయాల్, సుదర్శన్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.