మన్యం న్యూస్ గుండాల: ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడంతో ఎన్నికల అధికారుల నియమావళి ప్రకారం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రాన్ని గుండాల సీఐ ఏర్పాటు చేశారు. అనంతరం తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. గుండాల సీఐ ఎల్ రవీందర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి ఆదేశాల అనుసారం ఎన్నికలు అయిపోయేంతవరకు తనిఖీ ప్రతిరోజు ఉంటుందని ఎన్నికల నియమావళి ప్రకారం 50 వేలు దాటితే తప్పనిసరిగా రాసి తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానితంగా అక్రమంగా డబ్బులు తరలించిన వాటి గురించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారం లేకున్నా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అట్టి డబ్బులను సీజ్ చేయబడుతుందన్నారు. శాంతి భద్రతలకు కలిగించే పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
