* కెసిఆర్ నే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి…..తెల్లం
మన్యం న్యూస్ చర్ల:
మండలం లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు మంగళవారం విస్తృత పర్యటన లు చేశారు.చర్ల మండల కమిటీ సభ్యులతో కలిసి పులి గుండాల, కుర్నపల్లి,బోధనెల్లి, ఎర్రబోరు, చింతగుప్ప తదితర గ్రామాలు పర్యటించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. కేసీఆర్ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కానున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటమే కాక.అభివృద్ధిని కూడా చేసి చూపించిన వ్యక్తి ఒక్క కేసిఆర్ ఏ అని ఆయన అన్నారు. భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉన్నదని. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఐన తనను గెలిపించాలని నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామంలో యువత బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెల్లం వెంకట్రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది .పార్టీ లో చేరిన యువతకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికినారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీద కోదండరామయ్య, సాగి శ్రీనివాసరాజు, కొట్టేరు శ్రీనివాసరెడ్డి, తుర్రం రవి, మండల నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.