మన్యం న్యూస్, అశ్వాపురం: ఎన్నికల కోడ్ వెలువడిన నేపథ్యంలో అశ్వపురం సిఐ రవీందర్ సూచనల మేరకు ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు.అశ్వాపురం పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న తరుణంలో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా 30 లక్షల రూపాయలు వాహనంలో ఉండగా ఎస్సై తిరుపతి డబ్బు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసిసిబి బ్యాంకు డబ్బులను భద్రాచలం నుండి బయ్యారం తీసుకెళ్తున్నట్టు వాహనంలో ఉన్న డిసిసిబి బ్యాంక్ మేనేజర్ పూర్తి ఆధారాలతో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆధారాలు లేకుండా డబ్బులను బంగారాన్ని వెండి తరలించరాదని వాహనదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
