UPDATES  

 ఇల్లందులో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగసభ

ఇల్లందులో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగసభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సీఎం సభను దిగ్విజయం చేయాల్సిందిగా శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే హరిప్రియ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల డిపాజిట్లు గల్లంతు ఖాయం ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేయటం తథ్యం ఎంపీ మాలోత్ కవిత మన్యంన్యూస్,ఇల్లందు:నవంబర్ 1న ఇల్లందు పట్టణంలో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ ప్రాంగణాన్ని బుధవారం మహబూబాద్ ఎంపీ కవిత మాలోత్ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తో కలిసిబుధవారం పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ..రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్ధిగా తనను ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. టికెట్ ఖరారు అనంతరం ఇల్లందులో జరిగిన కొన్ని పరిణామాలు సద్దుమణిగే స్థితికి చేరాయని, వారు కూడా తమతో కలిసివచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయనున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న ఇల్లందు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఆశీస్సులతో తాను ఎంతగానో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నా గెలుపును ఆపలేరని హరిప్రియ ధీమా వ్యక్తంచేశారు. ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు గెలవలేదని, ఇల్లందులో అధికార పార్టీ ఎమ్మెల్యే వరుసగా గెలిచిన దాఖలాలు లేవని తెలిపారు. ఇల్లందు గతచరిత్రను తిరగరాసేలా తాను మరోమారు గెలిచి చరిత్ర సృష్టించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వటం ఖాయమని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ..నవంబర్ 1న ఇల్లందులో జరిగే సీఎం సభాస్థలిని పరిశీలించటం జరిగిందన్నారు. హరిప్రియ నాయక్ గెలుపును కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ హాజరుకానున్న భారీ బహిరంగ సభను నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు హరిప్రియకు మద్దతు తెలిపేలా హాజరై సీఎం సభను విజయవంతం చేయాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గంలో గతంలో జరగని, ఏ నాయకుడు చేయని అభివృద్ధిని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ నాలుగున్నర ఏళ్ళలోనే ఎంతగానో అభివృద్ధి చేసిచూపి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. నాయకులందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి చరిత్ర సృష్టించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయని ఈ రెండు తేదీలను కలిపితే ఆరు వస్తుందని ఇది కేసీఆర్ కు లక్కీ నంబర్ అని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసి చరిత్ర సృష్టిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల బూటకపు మాటలు నమ్మవద్దని ఈనెల 15న ప్రగతిభవన్ మీటింగులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని తెలియజేశారు. ఇల్లందులో హరిప్రియ హరిసింగ్ నాయక్ గెలుపు సునాయాసం అని ఎవరెన్ని కుట్రలు చేసినా హరిప్రియ గెలుపును ఆపలేరని స్పష్టంచేశారు. నవంబర్ 1న ఇల్లందులో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా శ్రేణులకు ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరావు, కౌన్సిలర్ జేకే శ్రీను, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !