మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని శేట్టుపల్లి గ్రామంలో గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మనీష్ రెడ్డి పేర్కొన్నారు మొత్తం గ్రామంలో 89 మంది కి వైద్య సేవలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీహరి, హెల్త్ అసిస్టెంట్ బిక్ష,సూపర్వైజర్ సత్యం, ఏఎన్ఎంలు అరుణ, ధనమ్మ, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
