- ప్రభుత్వ పథకాల ప్రచారంలో సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర
- 50 రోజుల అక్షర యుద్దం చేయండి
- హ్యట్రిక్ సిఎం సోషల్ మీడియా తోనే సాధ్యం
- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్ మణుగూరు:
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంలో సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర అని ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు.రానున్న 50 రోజుల పాటు అక్షరయుద్దం చేయాలని పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కు విప్ రేగా పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రస్తుత అభివృద్ది చెందుతున్న ఈ రోజులలో చరవాణి ప్రతి ఒక్కరికి ఒక అత్యవసర వస్తువుగా మారిందని,దీనిని ఉపయోగించి ఇందులో ఉన్న వివిధ అంశాలను,ఇంటర్ నెట్ ను ఉపయోగించుకుని ఎన్నో అద్బుతాలను,సృష్టించవచ్చునని వారు తెలిపారు.వాట్సాప్, ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి వేదికల ద్వారా ప్రభుత్వ అద్భుత పథకాలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాలలో కొన్ని లక్షల మందికి చేరే వేయవచ్చునని అన్నారు.అదే విధంగా హ్యాట్రిక్ సిఎం సోషల్ మీడియాతోనే సాధ్యమని, దాన్ని సహాకారం చేసుకోవడం లో సోషల్ మీడియా వారియర్స్ పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. నియోజక వర్గంలో సోషల్ మీడియాలో జరిగే యుద్దంలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని,వారిని కాపాడుకునే బాధ్యత తనదని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు తెలిపారు.