మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు పట్టణంలో డిఎస్పి రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు సిఐ రమాకాంత్ ఆధ్వర్యంలో పట్టణం లోని పూల మార్కెట్ సెంటర్ నందు ట్రాఫిక్ అంతరాయం లేకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వ్యాపారస్తులకు,ఆటో డ్రైవర్ల కు మణుగూరు ఎస్సై.రాజేష్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ,పట్టణంలో వైట్ లైన్ దాటి రోడ్ల పైన పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుందని అన్నారు.అంతేకాకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. వాహనదారులు అందరూ తమ వాహనాల పత్రాలు, సక్రమంగా ఉండేటట్టు చూసుకోవలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.