- గెలుపు ఖాయం మెజారిటీనే ధ్యేయం
- ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలి
- ప్రభుత్వ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
- బిఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు
- ఎన్నికల కథనరంగంలోకి దూసుకుపోవాలి
- -ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధి లోని పద్మశాలి భవన్ నందు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ,రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందని ఎన్నికలకు ఇంకా 48 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు.ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలన్నారు.ప్రణాళిక ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అన్నారు. ప్రచారానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు.100 ఓట్ల ఇన్చార్జిలు చాలా కీలకమని,బూత్ ఇన్చార్జిలు సమన్వయం తో అందరూ పనిచేయాలని, కలసికట్టుగా పనిచేస్తే విజయం సాధించవచ్చు అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలే బిఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని విప్ రేగా తెలిపారు.ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం జరిగిందని,భవిష్యత్తులో ఇంకా అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందన్నారు.త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని వారు తెలిపారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో తో ప్రతిపక్షాల అడ్రస్సు గల్లంత కావడం ఖాయం అన్నారు. బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయమని వారు దీమా వ్యక్తం చేశారు. ఎన్నికలలో,అనుచరించాల్సినటువంటి వ్యూహాలను, ప్రచారాస్త్రాలను పార్టీ ముఖ్య నాయకులకు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.ఎన్నికల కథనరంగం లోకి, దూసుకుపోవాలని కార్యకర్తలలో జోష్ ను నింపారు.నవంబర్ 4వ తారీఖున నామినేషన్ వేస్తానని వారు తెలిపారు.నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విప్ రేగా కాంతరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు పిఎసిఎస్ చైర్మన్ కుర్రీ. నాగేశ్వరరావు,టీబిజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్,వట్టం.రాంబాబు ఏడ్ల శ్రీను,యూసఫ్,రమేష్, శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ బాబు,పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు,బిఆ ర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.