UPDATES  

 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సుప్రీంకోర్టు లాయర్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి

మన్యం న్యూస్ ,నూగూర్ వెంకటాపురం:
ఆదివాసి కులదైవాలు అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క వనదేవతలను కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు.ఈ నేపథ్యంలో వెంకటాపురం నివాసి, సుప్రీంకోర్టు,హైకోర్టు లాయర్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి మంత్రి కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, ములుగు జిల్లాకు గిరిజన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఏజెన్సీ మండలమైనటువంటి మారుమూల వెంకటాపురం లో జూనియర్ డిగ్రీ కళాశాల ,ఫైర్ స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేయాలని వారు కోరినట్టుగా పిట్ట తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీవెనలతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వలన అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులలో ఊరట కల్పించినందుకు విద్యార్థులు ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటారని తెలియజేశారు. ములుగు గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించిన పిఎం నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపినట్టుగా ఆయన మన్యం న్యూస్ కి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !