మన్యం న్యూస్, చర్ల:
మండల పరిధి కొత్తపల్లి గ్రామానికి చెందిన నండ్రు శంకర్ తో పాటుపలువురు యువత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో అధ్యక్షులు సోయం రాజారావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, తుర్రం రవి, సీనియర్ నాయకులు అజీజ్, గోర్ల రాజబాబు, ఏనుటి జనార్దన్, గుండోజు నాగరాజు, కృష్ణార్జునరావు,ఈశ్వర్, వినోద్, సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, తదితరులు పాల్గొన్నారు.
