మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశం బుధవారం జరిగింది.ఈ సమావేశం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు సుతారి.నాగేశ్వరావు ఆధ్వర్యం లో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాగబోయిన.చంద్రయ్య దొర పాల్గొని మాట్లాడుతూ అన్ని సంఘాలు ఏకతాటి పై వచ్చి ఏజెన్సీ ప్రాంత హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణ చేయాలని, రానున్న ఎన్నికలనీ దృష్టి లో ఉంచుకొని ఏజెన్సీ ప్రాంత హక్కులను, చట్టాలను అమలు పరిచేందుకు రాజకీయ పార్టీల మేనిఫెస్టో లో ప్రకటించే విధం గా ఒత్తిడి తీసుక రావాలన్నారు.అదే విధంగా గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షుడు గోగ్గలి రవి మాట్లాడుతూ ఆదివాసీ యువత ను పాలకులు చదువు కి ఉపాధి అవకాశాలు దూరం చేస్తున్నారు అన్నారు.ఈ సమావేశం లో గిరిజన అభ్యుదయ సంఘం,ఆదివాసీ సంక్షేమ పరిషత్,తుడుందెబ్బ,నాయకులు గోగ్గెలి రవి,గొగ్గలి కృష్ణ,శ్రీను,చందా రామకృష్ణ,గణేష్,వెంకట రమణ పాల్గొన్నారు.
