అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు
*గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు ప్రకటించిన పీఎం మోదీ కృతజ్ఞతలు
*గిరిజనుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉంది.
* మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన్యం న్యూస్,ములుగు: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు కేంద్ర మంత్రి, బిజెపిరాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి అన్నారు.
ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను ఆయన బుధవారం దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాను. తెలంగాణకి గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కేటాయించి, దాని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతోపాటుగా..గిరిజన సెంట్రల్ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం తరపున, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను యావద్భారతం స్మరించుకునేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాము. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉంది అని బీజేపీని గెలిపించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
