బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశం
*బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.తెల్లం గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
* డాక్టర్ తెల్లం ని గెలిపిద్దాం సీఎం కేసీఆర్ కి కానుకగా ఇద్దాం
*బీ. ఆర్. ఎస్ మండల అధ్యక్షులుసోయం రాజారావు
మన్యం న్యూస్ ,చర్ల:
మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల బూత్ కమిటీల నియామక సమావేశం బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీ. ఆర్. ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి లబ్ధిదారులను కలిసి మరింతగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క బూత్ కమిటీ సభ్యుడు కూడా వారికి కేటాయించిన 100 మంది ఓటర్లను క్రమం తప్పకుండా కలుస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతి కార్యకర్త కూడా 47 రోజులు మరింత కష్టపడాలి అనిసూచించారు. మండలం నుండి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి తెల్లం వెంకట్రావు అత్యధిక మెజారిటీ తీసుకురావాలి కోరారు. డాక్టర్ తెల్లంని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీ. ఆర్. ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు, ఎంపీపీ కోదండరామయ్య, సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఇరస వడ్ల రాము, దొడ్డి సూరిబాబు, వరప్రసాద్, పోలురి సుజాత, పాశిగంటి దేవి, కాకి అనిల్, ఆలం ఈశ్వర్, అజీజ్, గోర్ల రాజబాబు, సీతాపతి రాజు, దొడ్డి తాతారావు, పంజా రాజు, తదితరులు పాల్గొన్నారు.
