మన్యం న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 11: మండల పరిదిలోని అంకంపాలెం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థిణీలు బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శుక్రవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు సెలవుల నేపథ్యంలో అంకపాలెం ఆశ్రమ పాఠశాలలో ముందస్తుగా బతకమ్మలు పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు తోలెం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శ్రీనివాస రావు, రమణ, శ్యామల, వెంకట రమణ, రామకృష్ణ, కాంతమ్మ, కృష్ణ ప్రసాద్, సురేష్, అనూష, దేవి, రజిని, లత, సత్యవతి సరస్వతి, నాగమణి, కుమారి తదితరులు పాల్గొన్నారు.