UPDATES  

 సింగరేణి ఎన్నికలకు కలిసిరాని ముహూర్తం!

సింగరేణి ఎన్నికలకు కలిసిరాని ముహూర్తం!
* అసెంబ్లీ ఎన్నికలు తర్వాతనే సింగరేణి ఎన్నికలు
* డిసెంబర్ 27కి వాయిదా వేస్తూ తీర్పు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరపడానికి షెడ్యూల్ విడుదలైనప్పటికీ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గత నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 28వ తేదీన కోల్ బెల్ట్ వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన కూడా జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను సైతం
కేటాయించారు. ఇది ఇలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించలేమని దీనిని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయాలని పేర్కొంటూ గతంలో సింగరేణి యాజమాన్యం తాజాగా ఈ నెల 5వ తేదీన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు సింగరేణి ఎన్నికలను
డిసెంబరు 27కు వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. నవంబరు 30వ తేదీలోగా ఓటర్ల జాబితాను రూపొందించాలని హైకోర్టు సింగరేణి అధికారులను ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే సింగరేణిలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యంకు సూచించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !