రేగా అభివృద్ధి చూసి…పల్లె మురిసే
*హైలెవల్ బ్రిడ్జి ల నిర్మాణం తో తరతరాల కష్టాలు తప్పే
*అతి మారుమూల శేట్టుపల్లి పల్లి గ్రామానికి బీ. టీ రహ దారి సౌకర్యం
*పోడు భూముల కు పట్టాలు ఇప్పించాడు
*అతి మారుమూల భూముకకు త్రీ పేజ్ విద్యుత్ సౌకర్యం
*మెరుగైన రహదారి సౌకర్యాలు
*అభివృద్ధి నాయకుడు ఎమ్మెల్యే రేగా ను గుండెల్లో పెట్టుకుంటాం
అభివృద్ధి నాయకుడి అడుగులో నడుస్తాం
గుండాల మండల ప్రజానీకం
మన్యం న్యూస్ గుండాల: ఒకనాడు గుండాల మండల దీన గాదను తలుచుకుంటే తలుచుకుంటే కన్నీరు ఆగదు. దట్టమైన అడవిలో అనేక ఆదివాసి గ్రామాలకు నిలయం గుండాల మండలం. ఏమి జరుగుతుందో కూడా తెలియనిపరిస్థితి. ఆ పల్లెలు అంధకారం లో గడిపిన రోజులెన్నో. పాము , తేలుకాటుకు గురైన పట్టణ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేక మధ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసేవి . అంత వెనుకబడిన మండలాన్ని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక విజన్ తో అభివృద్ధి చేశారు . ఎంతలా అంటే అభివృద్ధి చూసి గుండాల పల్లె మురిసే అనే విధంగా రహదారులు ,వాగులపై వంతెన నిర్మాణాలు చేపట్టి తరతరాల గుండాల మండల ప్రజల కష్టాలను తీర్చాడు. మన్యం న్యూస్ ప్రత్యేక కథనం మండలంలోని ప్రతి పల్లెను ప్రగతి పథంలో నిలపడంలో ఎమ్మెల్యే రేగా తన వంతు కృషి చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చెయ్యకుండా తన పవర్ ని వినియోగించి గుండాలమండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే నినాదంతో రూ కోట్ల రూపాయల నిధులు వెచ్చించి గుండాల మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించారు. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యేరేగా కాంతారావు గతంలో ఏ నాయకుడు చేయలేనంత అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాలలో చేసి చూపానని ప్రతి పల్లెకు రహదారి సౌకర్యాన్ని కల్పించడమే కాక అంతర్గత రహదారులను కూడా తీర్చిదిద్దారని మండల ప్రజలు రేగా అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు.రేగా సారధ్యంలో సంక్షేమం పరవళ్ళు తొక్కుతుంది. గుండాల మారుమూల ఏజెన్సీ మండలం అభివృద్ధికి ఏంతో దూరంలో ఉండడం తో ఈ మండలాన్ని తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన నాటి నుండి అన్ని రంగాల్లో ముందు ఉంచాలన్న దృఢ సంకల్పంతో నిత్యం పర్యటనలు చేస్తూ అభివృద్ధి కోసం అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో గుండాల మండల అభివృద్ధి లక్ష్యం గా ప్రణాళికలను రూపొందించారు. అందులో ముఖ్యమైనది ప్రతి పల్లెకు రహదారి సౌకర్యం కల్పిస్తే అభివృద్ధి అక్కడితోనే ప్రారంభమవుతుందని గమనించిన రేగా ముందుగా ప్రతి పల్లెకు రహదారులను మంజూరు చేయించి వాటిని పూర్తి చేసి ప్రారంభించారు. మండలంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఉండేవిధంగా అధికారులతో సమాలోచనలు చేసి ప్రతి పల్లెకు నిరంతరం విద్యుత్తు ఉండేవిధంగా చూశాడు. ఏజెన్సీలో నిత్యం ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే ప్రాంతాలు అని భావించిన రేగా కాంతారావు రెండు మండలాల్లో వైద్యశాలకు మెరుగైన సౌకర్యాలను కల్పించి నిత్యం వైద్యులు ఉండేవిధంగా కృషి చేశారు. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య శాల లో ఓకే వైద్యుడితో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందటం లేవు అది గమనించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు మరొక వైద్యుణ్ని నియమించే విధంగా కృషి చేశారు. ఇప్పటివరకు రెండు మండలాల్లో సీఎం సహాయనిధి అంటే తెలవని ప్రజలకు అత్యవసర సమయాల్లో సీఎం సహాయనిధి నుండి వందల సంఖ్యలో నిధులు మంజూరు చేయించి వారికి తోడ్పాటు గా నిలిచాడు. గుండాల మండలం చుట్టూ ప్రధాన వాగులు ప్రవహిస్తున్న ఎండాకాలం వచ్చిందంటే చాలు చుక్క నీరు కూడా వాగుల లో ఉండేది కాదు దానికి తోడు బోరులో సైతం నీళ్లు అంతంతమాత్రంగానే ఉండేది ఆ సమస్యను గమనించిన రేగా గుండాల మండలం లోని మల్లన్న వాగుపై ఆళ్లపల్లి మండలంలోని జల్లేరు వాగు పై కోట్ల రూపాయలు వెచ్చించి చెక్ డ్యాముల ను నిర్మించాడు వాటి వద్ద నీరు పెద్ద మొత్తంలో నిలవ ఉండడంతో భూగర్భ జలాలు భారీగా పెరుగుతాయి. మూగజీవాలకు సైతం నిత్యం నీరు వాటి వద్ద ఉంటుంది. చెక్ డ్యాములు నిర్మించిన ప్రాంతంలో రైతులకు భూములు ఉన్నందున ఎండాకాలంలో సైతం ఆ నీటిని వినియోగించుకుని పంటలు పండించుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రేగా విష్ణు ట్రస్టు ద్వారా కరోనా బారిన పడిన వారికి నిత్యావసరాలను అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రేగా కాంతారావు రెండు మండలాల్లో సంక్షేమ పర వాళ్ళను పారి స్తున్నారని మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా రెండు మండలాలను రెండు కన్నుల భావించి అభివృద్ధిలో ముందు నిలపాలని వారు కోరుకుంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి తమ కష్టాలను ప్రారద్రోలిన ఎమ్మెల్యే రేగా కాంతారావు ను గుండెల్లో పెట్టుకుంటామని మండల ప్రజలు అంటున్నారు.
