UPDATES  

 నా జీవితం ప్రజలకే అంకితం-మాజీ ఎమ్మెల్యే

నా జీవితం ప్రజలకే అంకితం-మాజీ ఎమ్మెల్యే
– నా వెంట నడిచే వారిని వదులుకోను.
– నిజాయితీ పనిచేశా ప్రజా అశీర్వాదం గెలుద్దాం.
– మాజీ ఎమ్మెల్యే,వైరా బీ. ఆర్. ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్‌
మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 12:
నిజాయితీగా దాపురికం లేకుండా పనిచేశానని ప్రజా ఆశీర్వాదంతో గెలవబోతున్నామని వైరా బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. గురువారం కారేపల్లిలోని వైఎస్‌ఎన్‌ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్‌ అధ్యక్షతన జరిగిన బూతు కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ మాట్లాడుతూ తాన నిజాయితీ నిలబడి ప్రజాశీర్వాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.మన మధ్య పొరపొచ్చలు వద్దని కుటుంబ సభ్యులుగా మెదిలి కారుగుర్తును గెలిపించుకుందామన్నారు.కారేపల్లి మండలం తనకు పుట్టిన గడ్డలాంటిదని గత ఎన్నికల్లో 2వేలు మెజార్టీ ఇచ్చిందన్నారు.నా వెంట నడిచే వారిని,పార్టీని నమ్ముకున్న వారిని ఎవరిని వదులుకోనన్నారు. బతికున్నంత వరకు ప్రజాసేవలోనే తరిస్తానన్నారు. కార్యకర్తలను గుర్తుపట్టలేని వారు రంగురంగుల కార్లలో వచ్చి మాయమాటలు చెప్పుతున్నారని కాంగ్రెస్‌ నుద్దేశింది ఎద్దేవా చేశారు.అనంతరం బూత్‌ కమిటీ సభ్యులకు ఓటర్‌ జాబితాలను అందజేశారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌,వైఎస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, సంత ఆలయ చైర్మన్‌ అడ్డగోడ ఐలయ్య,ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ,నాయకులు హన్మకొండ రమేష్‌,ఉన్నం వీరేంధర్‌,నర్సింగ్‌ శ్రీనివాసరావు,బానోత్‌ పద్మావతి తోటకూరి రాంబాబు, అడపా పుల్లారావు,బత్తుల శ్రీనివాసరావు ఎస్‌కె.గౌసుద్దీన్‌, వల్లభినేని గురవయ్య తితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !