UPDATES  

 కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

మన్యం న్యూస్,మణుగూరు:
మండలం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్ లో) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దులగూడెం గ్రామానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది యువకులు కలి బోయిన నాగరాజు, పూజారి రాంబాబు, కలి బోయిన మల్లేష్ , ఇనగల గోవర్ధన్ , కొమరం హరీష్, కొమరం కోటేష్, కొమరం అశోక్, కొమరం సతీష్, కొమరం రాజేష్, సోయం జంపయ్య, కాటిబోయిన కాంతారావు, తాటి శ్రీకాంత్, కొమరం జాని, కాటిబోయిన సురేష్,ల తో సహా పలువురు గురువారం బీ. ఆర్.ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ఎదురు లేదు అని అన్నారు, పేదల కష్టాలను తీర్చిన ఘనుడు సీఎం కేసీఆర్ ని ఆయన కొనియాడారు.రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి ,సంక్షేమ పథకాలకు మద్దతుగానే బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. పినపాక నియోజకవర్గాన్ని ప్రజలు తనకిచ్చిన అవకాశంతో అభివృద్ధి లో అగ్ర భాగాన నిలిపానని, మరోమారు ప్రజలు ఆశీర్వదిస్తే పినపాక నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నర్సింహారావు, బీఆర్ఎస్ పార్టీ టౌన్ నాయకులు అడపా అప్పారావు, బోలిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !