మన్యం న్యూస్,ఇల్లందు:హైదరాబాదులోని ప్రగతిభవన్ నందు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కల్వకుంట్ల తారకరామారావును గురువారం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు. కేటీఆర్ ను కలిసినవారిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు.
