మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 12, మండల కేంద్రంలోని ఏ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమకారులు వేల్పుల నరసింహారావు, భూక్య దేవిలాల్ నాయక్ లు గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, తెలంగాణా రాష్ట్రా ఉద్యమకారులకు, పార్టీ సీనియర్ నాయకులకు, ఏటువంటి సమాచారం ఇవ్వకుండా నేటి నాయకులు విస్మరిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో సీనియర్లమంతా కలిసి మా సొంత కార్యాచరనను ప్రకటిస్తామని అన్నారు. వైరా నియోజికవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ మద్యకాలంలో జరిగిన కార్యక్రమాలకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ, పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారని, దీనివలన పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైరా అభ్యర్థి విషయంలో పునరాలోచించి అభ్యర్థిని వెంటనే మార్చాలని కోరారు. 2001 బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు 22 సంవత్సరాలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, 14 సంవత్సరాలు ఉద్యమ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైలు జీవితం గడిపి, ఎన్నో విధాలుగా నష్టపోయి కేసీఆర్ నాయకత్వంలో నేటి వరకు పని చేస్తున్న మాలాంటి వారిని విస్మరించడం దురదృష్టకరమన్నారు. ఏకపక్షంగా వెళుతున్న వైరా అభ్యర్థి విషయంలో కెసిఆర్ పునరాలోచించి మార్చాలని, ఉద్యమకారులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, లేకుంటే వైరా నియోజకవర్గంలో ఐదు మండలాల తెలంగాణ ఉద్యమకారులు అందరినీ సమీకరించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు ఎవరు, తెలంగాణ ద్రోహులు ఎవరో తేల్చుకుంటామని తెలిపారు. తాము బిఆర్ఎస్ పార్టీలోకి బ్రతకడానికి వచ్చిన వారము కాదని, ప్రాణాలకు తెగించి బరిగీసి కొట్లాడిన వాళ్ళము అని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, బానోత్ బిక్కు నాయక్, రవికుమార్, లావుడియా దంజు నాయక్, వాంకుడోత్ బాలు తదితరులు పాల్గొన్నారు.
